ఒక్కరాత్రే 5 ఆలయాల్లో చోరీ

మెట్ పల్లి, వెలుగు: ఒక్క రాత్రే దుండగులు ఐదు ఆలయాల చోరీకి పాల్పడ్డారు. మెట్‌పల్లి మండలం రామలచ్చక్కపేటలో ఒకటి, జగ్గసాగర్‌‌లో 2, ఆత్మనగర్ లో రెండు ఆలయాల్లో మంగళవారం రాత్రి దొంగలు చొరబడి ఆలయ తాళాలు పగులగొట్టి హుండీని ధ్వంసం చేశారు. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం పూజారులు ఆలయాలకు వెళ్లగా ఆలయ తలుపులు పగులగొట్టి, హుండీ ధ్వంసం  చేసి ఉన్నాయి. వారు ఆలయ కమిటీ, గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు.

కాగా హుండీల్లోని నగదుతోపాటు ఆత్మనగర్ మల్లన్న ఆలయంలో 50 తులాల వెండి నగలు  చోరీ అయినట్లు ఆలయ కమిటీ సభ్యులు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.