శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు టెర్రరిస్టులు చనిపోయారు. మన జవాన్లు ఇద్దరు గాయపడ్డారు. కుల్గాం ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారని గురువారం తెల్లవారుజామున సమాచారం అందడంతో భద్రతా బలగాలు పోలీసులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. బెహిభాగ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రతా బలగాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా ఎదురు కాల్పులకు దిగారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు టెర్రరిస్టులు మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతిచెందిన వారిలో బుర్హాన్ వనీ టెర్రర్ గ్రూప్‌లోని కీలక వ్యక్తి, హిజ్బుల్ కమాండర్ ఫరూఖ్ నాలీ ఉన్నట్లు తెలిపారు. ఏ++ టెర్రరిస్ట్ అయిన అతనిపై రూ. 10 లక్షల రివార్డు కూడా ఉందని నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నది. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య తరచూ కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.