- గల్లా పెట్టెలోని డబ్బులిచ్చిన కెనడా నర్సరీ స్టూడెంట్
ఒట్టావా: యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రేనియన్లకు సాయం చేసేందుకు ఐదేండ్ల పిల్లాడు ముందుకొచ్చాడు. గల్లా పెట్టెలో దాచుకున్న రూ.1500 ఇచ్చాడు. లియామ్ మూర్ ది కెనడాలోని అంటారియో. నర్సరీ చదువుతున్నాడు. ఉక్రేనియన్లకు ఆర్థిక సాయం చేసేందుకు గాను స్కూల్లో ఫండ్ రైజింగ్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మూర్.. తన గల్లా పెట్టె పట్టుకొని స్కూల్కు వెళ్లాడు. అందులోని డబ్బులన్నీ తీసిచ్చేశాడు. మూర్ పెద్ద మనసుకు అందరూ ఫిదా అయ్యారు. ఐదేండ్ల పిలగాడు ఉక్రేనియన్ల కష్టాన్ని అర్థం చేసుకున్నాడని ఏడో తరగతి స్టూడెంట్ గౌవ్స్ వెల్ అన్నాడు. ఈ ఫండ్ రైజింగ్ పోగ్రాంలో 2,000 యూఎస్ డాలర్లు పోగుచేశామని చెప్పాడు.