ఐదేండ్ల పాపపై వీధికుక్కల దాడి కాలికి తీవ్ర గాయం.. పరిస్థితి విషమం

  • మైలార్ దేవ్ పల్లి పద్మశాలిపురంలో ఘటన

శంషాబాద్, వెలుగు: రాజేంద్రనగర్​సర్కిల్​మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని పద్మశాలిపురంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్న గులాబ్షా అనే ఐదేండ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. పాప మోకాలి కింది భాగంలో తీవ్ర గాయమైంది.

గమనించిన స్థానికులు కుక్కలను తరిమి, గులాబ్షాను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. వీధి కుక్కల సమస్యను తీర్చాలని అనేకసార్లు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.