కొండపోచమ్మ మృతుల అంత్యక్రియలు పూర్తి

ముషీరాబాద్, వెలుగు: సిద్దిపేటలోని కొండపోచమ్మ రిజర్వాయర్​కు వెళ్లి చనిపోయిన ఐదుగురిలో అన్నదమ్ములు ధనుశ్ (19), లోహిత్ (17) అంత్యక్రియలు ఆదివారం నింబోలిఅడ్డాలో ముగిశాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో  ముషీరాబాద్ ​ఇంద్రానగర్​లో  విషాదఛాయలు అలముకున్నాయి. ధనుశ్, లోహిత్ కు తల్లిదండ్రులు నర్సింగ్ రావు, జయశ్రీ తలకొరివి పెట్టారు. అంతకుముందు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రి శంకర్​ రావు  బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.  

ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ వద్ద ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయినా..భద్రత చర్యలను కట్టుదిట్టం చేయకపోవడం బాధాకమరన్నారు. ఇప్పటికైనా రిజర్వాయర్ పరిసరాల్లో సెక్యూరిటీని పెంచాలని సూచించారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.  

కొండపోచమ్మ సాగర్​ఘటన బాధాకరం

పద్మారావునగర్: కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఈతకు వెళ్లి మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ ఘటనలో బన్సీలాల్ పేట డివిజన్  సీసీ నగర్ కు చెందిన కిషన్, సుమలత దంపతుల కొడుకు దినేశ్( 17) కూడా మృతి చెందాడు. 

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదివారం దినేశ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అనంతరం దినేశ్​అంత్యక్రియల్లో స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. -ఇదే ఘటనలో మృతి చెందిన అత్తాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్పీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సాహిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (19),  ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చింతల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బస్తీకి చెందిన జతిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (19) అంత్యక్రియలు సైతం ఆదివారం ముగిశాయి.