చిలుకూరులో ఘనంగా ధ్వజారోహణం

చిలుకూరులో ఘనంగా ధ్వజారోహణం

చేవెళ్ల, వెలుగు: చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం ధ్వజారోహణం నిర్వహించారు. సిటీతోపాటు ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, నరసింహన్, మురళి, కిట్టు, కృష్ణమూర్తి, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.