ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లు ఏపీలో కలకలం రేపాయి. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ సిట్ దర్యాప్తుకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అల్లర్లు చెలరేగిన పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. జూన్ 4న కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో తాడిపత్రిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు.
అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ జరిగింది. పట్టణంలోని అశోక్ పిల్లర్,పాత కూరగాయల మార్కెట్ మరియు ఎల్లనూరు రోడ్డు సర్కిల్ మీదుగా టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఈ ఫ్లాగ్ మార్చ్ జరిగింది.సమస్యత్మక ప్రాంతాలైన పలుచోట్ల పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు.