- పోలీసులకు కంప్లైంట్
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు నిర్వహించకపోవడం విమర్శలకు దారితీసింది. గణతంత్ర దినోత్సవం వేళ క్యాపు కార్యాలయంపై జెండా కొందరు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి.
ఈ విషయంపై కొందరు టౌన్ సీఐ రాజేంద్ర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. జెండా ఎగురవేయకుండా జాతీయ జెండాను అవమానించారని మండిపడ్డారు. అయితే ఎమ్మెల్యే హరీశ్ బాబు హైదరాబాద్ లోని అసెంబ్లీ కార్యాయం వద్ద గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారని ఆయన అనుచరులు పేర్కొన్నా.. వ్యవహారం సద్దుమణగలేదు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాయంలోనే జెండా ఎగురవేయకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.