ఖానాపూర్, వెలుగు: వర్గీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చు పెడుతోం దని మాల మహానాడు నాయకులు అన్నారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో మాల మహానాడు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. మాలలు ఐక్యంగా పోరాటాలు చేసి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
ఎస్సీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లతోపాటు ప్రవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 1న హైదారాబాద్లో మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభకు మాలలు పెద్ద ఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయాలని పిలుపనిచ్చారు. నాయకులు రాజేశ్వర్, నేత శ్యామ్, రాజశేఖర్, అశోక్, సతీశ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.