మెదక్​ జిల్లాలో జాతీయ జెండాకు అవమానం

మెదక్​ జిల్లాలో జాతీయ జెండాకు అవమానం

రామాయంపేట, కొల్చారం, వెలుగు: రిపబ్లిక్​ వేడుకల్లో భాగంగామెదక్​ జిల్లాలో రెండు చోట్ల జెండాకు అవమానం జరిగింది. రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బిక్షపతి జెండా ఎగురవేశారు. అయితే  ముందుగా చూసుకోకపోవడంతో జెండాను తలకిందులుగా ఎగుర వేశారు.

జెండా పైకి వెళ్లిన తర్వాత గమనించిన అధికారులు  జెండాను సరిచేశారు మండల కేంద్రమైన కొల్చారంలో కూడా జాతీయ జెండాకు అవమానం జరిగింది. స్థానిక రైతు వేదిక ఆవరణలో వ్యవసాయ విస్తరణ అధికారి వినీత జాతీయ జెండా ఎగురవేస్తుండగా ఒకసారిగా జెండా కిందకు జారి పడింది. ఆ తర్వాత సరిచేసి మళ్లీ ఎగురవేశారు.