ఉమ్మడి వరంగల్​జిల్లాలోఘనంగా ప్రజాపాలన వేడుకలు

ఉమ్మడి వరంగల్​జిల్లాలోఘనంగా ప్రజాపాలన వేడుకలు
  • ఉమ్మడి వరంగల్​జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఉమ్మడి వరంగల్​జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17ను ప్రజాపాలన రోజుగా నిర్వహిస్తూ జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో జెండావిష్కరణలు చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వరంగల్​జిల్లా కేంద్రంలో రెవెన్యూ శాఖ, ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, హనుమకొండలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ములుగులో పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క, జనగామలో ప్రభుత్వ విప్​బీర్ల అయిలయ్య, మహబూబాబాద్​లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రనాయక్, జయశంకర్​భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర అటవీ, అభివృద్ధి సంస్థ చైర్మన్​ పోదెం వీరయ్య పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని జెండావిష్కరణ చేశారు. – వెలుగు, నెట్​వర్క్