మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా.. చాలా డేంజరస్..48 గంటల్లో మరణం

మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా.. చాలా డేంజరస్..48 గంటల్లో మరణం

స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్(STSS) బ్యాక్టీరియా..ఇది కరోనా కంటే డేంజరస్.. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ వణికిపోతుంది. మనిషి మాంసాన్ని తిని బతికే ఈ బ్యాక్టీరియా వలన సంభవించే ప్రాణాంతక వ్యాధి కేసులు జపాన్ లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫెక్షియస్ డీసీజెస్ ప్రకారం.. 2024 జూన్ 2 నాటికి 977 కేసులు నమోదు అయ్యాయి. ఇది సాధారణంగా స్ట్రెప్ థ్రోట్ వంటి తేలిక పాటి అనారోగ్య లక్షణాలతో మొదలవుతుంది. క్రమంగా శరీరంలోని అవయవాల నొప్పి, వాపు, జ్వరం, లో బీపీ, నెక్రోసిస్ వంటి తీవ్రమైన లక్షాణాలను చూపుతుంది. చివరికి అవయవాలు పూర్తిగా దెబ్బతిని  మరణానికి దారితీవయచ్చు. ఈ వ్యాధి ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారికి చాలా ప్రమాదకరం. 

ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతాయి.. ఉదయం పాదంలో వాపు.. మధ్యాహ్నం నాటికి మోకాలికి వ్యాపిస్తుంది. రోగి 48 గంటల్లో చనిపో వచ్చ ని..టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీలో ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ కెన్ కికుచి అంటున్నారు. అంటే బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తుంది. 

ప్రస్తుత ఈ బ్యాక్టీరియాతో జపాన్ ఈ ఏడాది 2500 కేసులు నమోదు అయ్యాయి. మరణాల రేటు 30 శాతం ఉందని ప్రొఫెసర్ కికుచి హెచ్చరించారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, బయటి గాయాలకు చికిత్స తప్పనిసరిగా చేసుకోవాలని చెబుతున్నారు. రోగుల పేగుల్లో ఈ బ్యాక్టీరియా జీవిస్తుందటని కికుచి చెప్పారు. ఇది మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుందన్నారు. ఈ ప్రమాదరకమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.