
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆస్ట్రేలియా జట్టుకు రెండు వన్డే వరల్డ్ కప్ లు అందించడంతో పాటు.. రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు అందించిన ఘనత పాంటింగ్ సొంతం. కెప్టెన్ గానే కాదు బ్యాటర్ గాను పాంటింగ్ రికార్డ్స్ అద్భుతం. టెస్ట్, వన్డే ఫార్మాట్ లో 13 వేలకు పైగా పరుగులు చేసిన అతి కొద్ధి మందిలో పాంటింగ్ ఒకడు. ఇప్పుడు పాంటింగ్ వారసత్వం కొనసాగనుంది. అతని కొడుకు చాలా చిన్న వయసులోనే ఆకట్టుకునే ఆట తీరుతో వైరల్ గా మారాడు.
పాంటింగ్ కొడుకు ఫ్లెచర్ విలియం పాంటింగ్ లక్నోలో పంజాబ్ కింగ్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తన బ్యాటింగ్ స్కిల్స్ చూపించాడు. ఈ కుర్రాడి ఆటతీరు అచ్చం తండ్రి ఆట తీరును గుర్తు చేశాయి. పాంటింగ్ ప్రాక్టీస్ లో బంతులు వేస్తుండగా.. అతని కొడుకు డ్రైవ్‌లు, పుల్ షాట్‌లు ఆడిన తీరు అభిమానులని ఆకట్టుకున్నాయి. నెటిజన్స్ అందరూ తన తండ్రి ఐకానిక్ స్ట్రోక్ తో ఆటతో పోలుస్తున్నారు. పంజాబ్ కింగ్స్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారుతుంది.
ALSO READ | CSK vs RR: ఈ ఆటిట్యూడ్ అవసరమా: రాజస్థాన్ కెప్టెన్ ఓవరాక్షన్..సెల్ఫీ ఇచ్చి ఫోన్ పడేశాడు
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రికీ పాంటింగ్ పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. అతని మార్గదర్శకత్వంలో జట్టు తొలి మ్యాచ్ లోనే ఆకట్టుకుంది, గుజరాత్ టైటాన్స్ పై 11 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. శ్రేయాస్ అయ్యర్ తో కలిసి పాంటింగ్ జట్టుకు తొలిసారి టైటిల్ అందించాలని ఆ ఫ్రాంచైజీతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ గా పాంటింగ్ ను తొలగించిన తర్వాత అతను పంజాబ్ జట్టుకు హెడ్ కోచ్ గా వచ్చాడు.
2021 సీజన్‌లో ఫైనల్
పాంటింగ్ శిక్షణలో ఢిల్లీ క్యాపిటల్స్ 2021 ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్ చేరింది. అయితే, టైటిల్ గెలవడంలో విఫలమయ్యారు. తుది పోరులో ముంబై చేతిలో చిత్తయ్యారు. ఆసీస్ దిగ్గజం కాలంలోనూ, ఐపీఎల్ చరిత్రలోనూ అదే వారి అత్యుత్తమ ప్రదర్శన. 2024 సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న ఢిల్లీ.. గత మూడు ఎడిషన్‌లలో ప్లేఆఫ్‌కు అర్హత సాధించడానికి కూడా చాలా కష్టపడింది. 2023లో తొమ్మిది, 2022లో ఐదు, 2021లో మూడు, 2019లో మూడు, 2018లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పాంటింగ్.. ఏడేళ్ల పాటు ఢిల్లీకి తన సేవలు అందించారు.