మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

 మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం స్థానికంగా కలకలం రేపింది. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయారా అంటూ ఫ్లెక్సీల్లో ప్రశ్నించారు.  

ఒక్క ప్రైవేట్ డిగ్రీ కళాశాల నుంచి వచ్చే నిధులు, కేటీఆర్ అనుచరుల స్వలాభం కోసం వేలాది మంది విద్యార్థుల జీవితాలను ఆగమాగం చేస్తున్నారని ఫ్లెక్సీలో రాశారు. బంగారు తెలంగాణ అంటే విద్యార్థులను చదువుకు దూరం చేయడమేనా అని నిలదీశారు. విద్యార్థుల ద్రోహి కేటీఆర్ మా కొద్దు ఈ పాలన అంటూ ఫ్లెక్సీల ద్వారా వ్యతిరేకత చూపించారు. అయితే కేటీఆర్ కు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలపై టీఆర్ఎస్ మండిపడుతోంది. ప్రతిపక్షాలు కుట్రలో భాగంగానే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అంటున్నారు.