ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీ కలకలం

  • మీటింగ్​ పెట్టి క్లారిటీ ఇచ్చిన తెల్లం

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం నియోజకవర్గ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే డాక్టర్​తెల్లం వెంకట్రావుకు వ్యతిరేకంగా మంగళవారం దుమ్ముగూడెం మండలం ములకపాడులో ఆదివాసీల పేరిట ఫ్లెక్సీ వెలిసింది. ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ‘గెలిపించిన కార్యకర్తలనుఅవమానించి, హేళన చేసే విధంగా పార్టీ మారే విధానాన్ని నియోజకవర్గానికి తీసుకురాకండి’ అంటూ పలు విషయాలు పేర్కొంటూ ఆదివాసీల పేరిట ఫ్లెక్సీ ఉంది.  కాగా వెంటనే ఎమ్మెల్యే తన క్యాంపు ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేసి తాను బీఆర్​ఎస్​ను వీడబోనని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైనా  సీఎంను కలవొచ్చని, అందులో భాగంగానే రేవంత్​రెడ్డిని కలిశానని తెలిపారు. మంత్రి పొంగులేటి తమ కుటుంబ శ్రేయోభిలాషి అని చెప్పారు.