బాల్కొండ, వెలుగు: బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో బీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాడర్ మధ్య వివాదం నెలకొంది. ఆదివారం రిపబ్లిక్ వేడుకల్లో క్యాంపు ఆఫీస్ లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఫొటోలు ఉండడంపై కాంగ్రెస్ లీడర్లు మండిపడ్డారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు లేకపోవడంతో ఈ ఫ్లెక్సీ వివాదం జరగ్గా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ను బీఆర్ఎస్ ఆఫీస్ గా మారుస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.