
హైదరాబాద్, వెలుగు: డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లెక్సీలోన్స్ ఈ ఏడాది తెలంగాణలో భారీ సంఖ్యలో లోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కంపెనీ తెలంగాణలో 2024 వరకు మొత్తం మీద రూ. 200 కోట్లకుపైగా అప్పులు ఇచ్చింది.
2024లో తెలంగాణ నుంచి 22 వేల దరఖాస్తులు వచ్చాయి. ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ఎత్తున వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లు, టర్మ్ లోన్‌లను అందించామని తెలిపింది. వీటిలో 70శాతం టోకు వ్యాపారులు, రిటైలర్లు, 20శాతం సర్వీస్ప్రొవైడర్లకు, 10శాతం తయారీదారులకు ఇచ్చామని ఫ్లెక్సీలోన్స్ కో–ఫౌండర్ మనీష్ లూనియా చెప్పారు.