ఫ్లెక్సీ కలకలం.. ఎమ్మెల్యే ఊళ్లోకి రావొద్దంటూ ఫ్లెక్సీలు

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. మా ఊరికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ రావొద్దంటూ గ్రామస్తులు ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. బీఆర్ ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించగా.. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రంగంలోకి దిగిన పోలీసుల ఇరువర్గాలకు నచ్చ జెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు. 

ALSO READ: సమస్యల్లో సంక్షేమ హాస్టళ్లు..  పెచ్చులూడుతున్న పైకప్పులు