ఒకరిద్దరికి అధికారులు ఊడిగం చేయొద్దు

ఖమ్మం జిల్లాలో అధికార పార్టీలో ప్లెక్సీల వార్ నెలకొంది.  పాలేరు రిజర్వాయర్ లో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ఫ్లెక్సీల ఏర్పాటు వివాదానికి కారణమైంది.  స్థానిక ఎంపీ నామా నాగేశ్వర్ రావు, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి చేప పిల్లల విడుదల కార్యక్రమానికి అటెండయ్యారు. ఐతే అక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్సీలు వారి ఫొటోలు లేకపోవడంతో చేప పిల్లలను విడుదల చేయకుండానే ఇద్దరు ఎంపీలు వెళ్లిపోయారు.  



మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే కందాల ఫ్లెక్సీలు పెట్టాలని ఎవరు చెప్పారంటూ జిల్లా పార్టీ ప్రెసిడెంట్,  ఎమ్మెల్సీ తాతా మధు హెచ్చరించారు. ఒకరిద్దరికి అధికారులు ఊడిగం చేయొద్దని ఫైర్ అయ్యారు. మీరు చేస్తున్న పనులపై కమిషనర్ తో మాట్లాడుతానంటూ  వార్నింగ్ ఇచ్చారు.  ఫ్లెక్సీలు పెట్టడంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని  టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.