
వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీలోని కొత్త, పాత నేతల మధ్య ఫ్లెక్సీవార్ నెలకొన్నది. మంగళవారం మండల పరిధిలోని ఇల్లంద గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే నాగరాజు వస్తుండగా స్వాగతం పలికే ఫ్లెక్సీలో తన పేరు లేదని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్ పేర్కొనడంతో గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్‌కు మధ్య గొడవ జరిగింది.
దీంతో ఇరు వర్గాల మధ్య వార్ సాగగా పోలీసులు వారిని విడిపించారు. ఇదిలా ఉండగా, ఇల్లంద, కొత్తపల్లి, ల్యాబర్తి, కట్ర్యాల, వర్ధన్నపేట, కడారిగూడెం, నల్లబెల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఆకేరు వాగులో ఇసుక తీత పనికి వెళ్లేవారు. అక్కడ ఇసుక తీత నిలివేయడంతో ఉపాధి కోల్పోయారు. తమకు ఉపాధి చూపించాలని ఎమ్మెల్యేను కలిసేందుకు రాగా, ఆయన తమను పట్టించుకోకుండా వెళ్లిపోయారంటూ ధర్నా చేపట్టారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని,
ఆత్మహత్యే శరణ్యమని ఓ వ్యక్తి పెట్రోల్ బాటిత్తో రాగా, పోలీసులు వెంటనే అతడి వద్ద నుంచి బాటిల్ లాక్కున్నారు. పోలీసులు సర్ధి చెప్పడంతో ధర్నాను విరమించారు.