సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్‌‌‌‌‌‌‌‌

సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్‌‌‌‌‌‌‌‌
  • హరీశ్‌‌‌‌‌‌‌‌రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఫ్లెక్సీ, చించేసిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు
  • ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ఫ్లెక్సీ చించిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలు
  • పోటాపోటీగా ఆందోళనకు దిగిన ఇరు పార్టీల లీడర్లు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మధ్య నెలకొన్న ఫ్లెక్సీ వార్‌‌‌‌‌‌‌‌తో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి ఫ్లెక్సీల చించివేతతో ప్రారంభమైన గొడవ శనివారం మధ్యాహ్నం వరకు సాగింది. వివరాల్లోకి వెళ్తే... ‘అన్నదాతలకు రూ. 2 లక్షల రుణమాఫీ జరిగింది, హరీశ్‌‌‌‌‌‌‌‌రావు.. దమ్ముంటే రాజీనామా చేయ్‌‌‌‌‌‌‌‌’ అంటూ పూజల హరికృష్ణ పేరిట సిద్దిపేటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 

వీటిని గమనించిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలు రాత్రి 11 గంటల టైంలో ఆందోళనకు దిగడంతో పాటు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఫ్లెక్సీలను చింపివేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ వద్దకు వెళ్లి అక్కడున్న ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ఫ్లెక్సీని ధ్వంసం చేశారు. దీంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఆందోళనకు దిగడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు.

పోటాపోటీగా ఆందోళనలు

ఫ్లెక్సీల చించివేతపై కాంగ్రెస్, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ శ్రేణులు శనివారం పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించారు. హరీశ్‌‌‌‌‌‌‌‌రావును కించపరిచేలా ఫ్లెక్సీలు పెట్టడం, క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆపీస్‌‌‌‌‌‌‌‌లో ఫ్లెక్సీల చించివేతను నిరసిస్తూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు పాత బస్టాండ్‌‌‌‌‌‌‌‌ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. 

ఇదే టైంలో సిద్దిపేట కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి పూజల హరికృష్ణ నాయకత్వంలో కాంగ్రెస్ లీడర్లు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫ్లెక్సీతో ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు బయలు దేరారు. క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో ఐదు గంటల పాటు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లెక్సీల చించివేతతోపాటు ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట ఏసీపీ మధు ప్రకటించారు. 

ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌రావు క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కోకి అక్రమంగా ప్రవేశించి ఫ్లెక్సీ చింపివేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అత్తు ఇమామ్, మమ్మద్ గౌసొద్దీన్‌‌‌‌‌‌‌‌, నవాజ్‌‌‌‌‌‌‌‌బాబా, మున్నాపై సిద్దిపేట వన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదు అయింది. అలాగే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఫ్లెక్సీలు చించిన, పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించిన, పర్మిషన్‌‌‌‌‌‌‌‌ లేకుండా ర్యాలీ తీసిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలు ఎర్రబాబు, తప్పేట పరుశురాం, సామల భాస్కర్, అరవింద్ రెడ్డి, శ్రవణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, పెర్క బాబు, కురుమ నరేశ్‌‌‌‌‌‌‌‌, బెల్లంకొండ వెంకట్‌‌‌‌‌‌‌‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు అయినట్లు ఏసీపీ తెలిపారు.