గద్వాల, వెలుగు: గద్వాల కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీ వార్ కలకలం రేపుతున్నది. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్థరాత్రి చించి వేశారు. జడ్పీ చైర్మన్ సరిత భర్త తిరుపతయ్య, బీఆర్ఎస్ లీడర్ బండ్ల చంద్రశేఖర్ రెడ్డిలు ఫ్లెక్సీలను చించివేశారని మంగళవారం గద్వాల సీఐ శ్రీనివాసులుకు ఆయన కంప్లైంట్ చేశారు.
విజయ్ కుమార్ మాట్లాడుతూ తిరగబడు తరిమికొట్టు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ ఫుటేజీలు పరిశీలించి ఫ్లెక్సీలు చించేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.