నల్గొండ జిల్లాలో ఓ హోటల్ నిర్వాకం చూస్తే దిమ్మతిరిగుతుంది. హోటల్ పేరేమో విలేజ్ ఆర్గానిక్, కానీ అక్కడ సర్వ్ చేసే బిర్యానీలో మాత్రం ఈగలు, పురుగులు దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని చిట్యాల మండలంలో పెదకాపర్తి గ్రామశివారులోని నేషనల్ హైవే పక్కనే ఉంది ఈ హోటల్. అటు వెళ్తున్న కస్టమర్ సదరు హోటల్ కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. ఆకలితో ఉన్న కస్టమర్ కు ఆ హోటల్ వాళ్ళు సర్వ్ చేసిన బిర్యానీ చూసి షాక్ తగిలింది. ఎందుకంటే ఆ బిర్యానీలో చికెన్ పీసులతో పాటు ఈగలు, పురుగులు కూడా దర్శనమిచ్చాయి.
బిర్యానీలో ఈగలు, పురుగులు చూసి కడుపు రగిలిపోయిన కస్టమర్లు... విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.ఘటనను హోటల్ యజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినందుకు కస్టమర్లపై దురుసుగా ప్రవర్తించారు హోటల్ సూపర్వైజర్.ఈ ఘటనపై నల్లగొండ ఫుడ్ సేఫ్ట్ అధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు బాధితులు.
క్వాలిటీ లేని కుళ్ళిన ఫుడ్ ను ఆర్గానిక్ ఫుడ్ పేరుతో అంటగడుతున్న హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.