విమానం గాలిలో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఫ్లైట్ వేగానికి కొట్టుకపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పైలెట్ చాకచక్యంతో విమానాన్ని వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..
అలాస్కా ఎయిర్ లైన్స్ 1282 ఒరెగాన్ విమానం శుక్రవారం పోర్ట్‌ల్యాండ్ నుండి కాలిఫోర్నియాలోని అంటారియోకి బయలుదేరింది. గాలిలోకి వెళ్లిన కొద్ది సేపటికే విమానం యొక్క ఎగ్జిట్ డోర్ ఫ్లైట్ వేగానికి కొట్టుకపోయింది. దీంతో ప్రయాణికులు కలవరానికి గురయ్యారు. వెంటనే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని అలాస్క ఎయిర్ లైన్స్ సంస్థ తెలిపింది.
ప్రయాణికులకు ఎటువంటి హాని జరగలేదని అలాస్క ఎయిర్ లైన్స్ సంస్థ తెలిపింది. విమానం వినియోగానికి వచ్చి కేవలం రెండు నెలలే అవుతుందని నవంబర్ 2023లో ఎవియేషన్ నుంచి ధృవీకరణ పొందిందని సంస్థ చెప్పింది.ఘటనపై విచారణ జరుపుతున్నామని ఎయిర్‌లైన్స్ తెలిపింది.