చెన్నై ఎయిర్ పోర్ట్లో ఫ్లైట్కు తప్పిన ప్రమాదం

చెన్నై ఎయిర్ పోర్ట్ లో పెను ప్రమాదం తప్పింది.  రన్ వే పై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఇండిగో ఎయిర్ లైన్స్  ఎయిర్ బస్ విమానం  కంట్రోల్  తప్పింది.  రన్ వేపై వాటర్ ఉండటంతో..ల్యాండ్ అవ్వడం సాధ్యం కాలేదు. దీంతో  తిరిగి టేకాఫ్  చేశాడు పైలెట్.  

దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫెంగల్ తుపాను ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతికూల వాతావరణంతో నిన్న ఎయిర్  పోర్టును మూసేశారు. ఇవాళ కాస్త వాతావరణ అనుకూలించడంతో విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి.

  • Beta
Beta feature