చుక్కల్లో విమాన చార్జీలు.. పండుగ డిమాండ్​తో 25 శాతం పెంపు

చుక్కల్లో విమాన చార్జీలు.. పండుగ డిమాండ్​తో 25 శాతం పెంపు

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌లో విమాన చార్జీలు దూసుకు వెళుతున్నాయి. కీలకమైన దేశీయ రూట్లలో   వన్‌‌‌‌‌‌‌‌వే టికెట్ సగటు ధర 10–-15 శాతం ఎక్కువగా ఉంది. దీపావళి,  ఓనం కోసం కేరళ నగరాలకు వెళ్లే కొన్ని విమానాల చార్జీలు 20–-25 శాతం పెరిగాయని ట్రావెల్ ​పోర్టల్​ ఇక్సిగో తెలిపింది. దీని స్టడీ ప్రకారం.. అక్టోబర్ 30–-నవంబర్ 5 మధ్య కాలంలో ఢిల్లీ-–చెన్నై రూట్‌‌‌‌‌‌‌‌లో నాన్‌‌‌‌‌‌‌‌స్టాప్ ఫ్లైట్ కోసం వన్-వే ఎకానమీ క్లాస్ ధర రూ. 7,618 ఉంది.  ఇది గతేడాది నవంబర్ 10-–16 మధ్య కాలంలోని చార్జీలతో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. ముంబై–-హైదరాబాద్ రూట్‌‌‌‌‌‌‌‌లో చార్జీలు 21 శాతం ఎక్కువ ఉన్నాయి.

వన్​వే టికెట్​కు రూ. 5,162 వరకు చెల్లించాలి.  ఢిల్లీ–-గోవా,  ఢిల్లీ–-అహ్మదాబాద్ రూట్లలో చార్జీలు వరుసగా రూ. 5,999లకు,  రూ. 4,930లకు పెరిగాయి.  కొన్ని ఇతర మార్గాలలో చార్జీలు 1-–16 శాతం  ఎక్కువగా ఉంటాయి.  దీపావళి  ప్రయాణానికి డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతోందని ఇక్సిగో  సీఈఓ రజనీష్‌‌‌‌‌‌‌‌  కుమార్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.   "ఢిల్లీ–-చెన్నై, ముంబై–-బెంగళూరు,  ఢిల్లీ-–హైదరాబాద్ వంటి పాపులర్ రూట్లలో సగటు వన్-వే చార్జీలు రూ. 4,000–-5,000 మధ్య ఉన్నాయి. పండుగ సమీపిస్తున్న కొద్దీ ఇవి వార్షికంగా 10–-15 శాతం పెరుగుతున్నాయి" అని ఆయన చెప్పారు.

కొన్ని రూట్లలో తగ్గుదల

కొన్ని రూట్లలో చార్జీలు పెరుగుతుండగా, కొన్ని రూట్లలో చార్జీలు కూడా 1 శాతం నుంచి 27 శాతం వరకు తగ్గాయి.  ముంబై–-అహ్మదాబాద్ విమాన టిక్కెట్ ధర 27 శాతం క్షీణించి రూ.2,508కి చేరుకోగా, ముంబై-–ఉదయ్‌‌‌‌‌‌‌‌పూర్ విమాన టికెట్ ధర 25 శాతం తగ్గి రూ.4,890లకు పడిపోయింది.  బెంగళూరు–-హైదరాబాద్ విమానాల చార్జీలు 23 శాతం తగ్గి రూ. 3,383కి, ముంబై–-జమ్మూ విమానానికి 21 శాతం తగ్గి రూ.7,826కి చేరుకుంది. కేరళలో జరగబోయే పండుగ కోసం ఎంపిక చేసిన మార్గాల్లో విమాన చార్జీల ధరలు  కొన్ని మార్గాల్లో  ఒక శాతం నుంచి 25 శాతం వరకు పెరిగాయని తేలింది.

కొన్ని రూట్లలో టికెట్ ధరలు 6-–35 శాతం తగ్గాయి.  గత ఏడాది ఓనంను 2023 ఆగస్టు 20–-29 మధ్య జరుపుకున్నారు.  ఈ సంవత్సరం సెప్టెంబర్ 6-–15 మధ్య జరుగుతుంది. వార్షికంగా చార్జీలు బాగా పెరిగాయి. హైదరాబాద్–-తిరువనంతపురం విమానానికి రూ. 4,102 వసూలు చేశారు. అంటే 30 శాతం పెరుగుదల నమోదయింది. ముంబై–-కాలికట్ విమానాల చార్జీ ధర రూ. 4,448లకు పెరిగింది.  కొచ్చిన్, కాలికట్,  తిరువనంతపురం వంటి కీలక నగరాలకు సగటు విమాన చార్జీలు 20–-25 పెరిగాయని రజనీష్ కుమార్ చెప్పారు. 

అనవసరమైన చార్జీల పెంపుతో ప్రయాణికులు నష్టపోకుండా ఉండేలా ఫిర్యాదులను పరిష్కరించడానికి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ నెల ప్రారంభంలో లోక్‌‌‌‌‌‌‌‌సభకు తెలిపారు.  ప్రస్తుత నిబంధనల ప్రకారం, మార్చి 1994లో ఎయిర్ కార్పొరేషన్ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత విమాన చార్జీలను ప్రభుత్వం నియంత్రించడం లేదు.