కరోనా టీకా ట్రాన్స్ పోర్టుకు విమానాలు రెడీ

వ్యాక్సిన్​ రవాణాకు ముంబై ఎయిర్​పోర్టులో 24 గంటల గ్రీన్​చానెల్​

‘ఎక్సిమ్​’ కోసం స్పెషల్​ టాస్క్​ఫోర్స్​, కస్టమర్​ కేర్​

హైదరాబాద్​, ఢిల్లీ ఎయిర్​పోర్టుల్లో టెంపరేచర్​ కంట్రోల్​ జోన్లు

వీలైనన్ని ఎక్కువ ఫ్లైట్లు నడుపుతామన్న బ్లూ డార్ట్​

హైదరాబాద్​ సహా 8 చోట్ల ఫార్మా గ్రేడ్​ రూములున్నాయన్న కంపెనీ

ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ఎయిర్​పోర్టులు, విమాన కంపెనీలు

కరోనాను అంతం చేసే వ్యాక్సిన్లు మస్తు స్పీడుగా రెడీ అయిపోతున్నయ్ . ఎంత స్పీడ్ గా రెడీ అయితున్నయో అంతే స్పీడ్ గా టీకాలను సరఫరా చేయాలె. వ్యాక్సిన్ ను రవాణా చేయాలంటే మైనస్‌‌ టెంపరేచర్‌‌లో ఉండాలె. ఎక్కడా సప్లై చెయిన్ తెగిపోవద్దు. ఎక్కువ టీకాలను తీస్కరావాలన్నా.. తీస్కపోవాలన్నా
విమానాలే కీలకం. అందుకు ఎయిర్ పోర్టుల్లో స్లాట్ లు అందుబాటులో ఉండాలె. వచ్చిన టీకాలు ఖరాబ్​కాకుండా దాచేందుకూ సౌలతులుండాలె.

న్యూఢిల్లీ: వ్యాక్సిన్లను స్టోర్​ చేసేందుకు సెపరేట్​గా టెంపరేచర్​ కంట్రోల్​ జోన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని తీసుకొచ్చే విమానాలకు అనువైన స్లాట్స్​ ఇస్తామని దేశంలోని ప్రధాన ఎయిర్​పోర్టులు హామీ ఇచ్చాయి. ఇటు తక్కువ టైంలో వీలైనన్ని ఎక్కువ విమానాలు నడుపుతామని ఎయిర్​ కార్గో కంపెనీలు చెబుతున్నాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టును దేశంలో మందుల ట్రాన్స్​పోర్టేషన్​కు గేట్​వే అని  పిలుస్తుంటారు. అక్కడ వ్యాక్సిన్​ను తీసుకొచ్చే విమానాలకు అనువైన టైం, డేట్​ స్లాట్​ను ఇస్తామని ఎయిర్​పోర్టు అధికారులు చెప్పారు. టీకా సరఫరాకు ఎలాంటి అడ్డు లేకుండా 24 గంటల పాటు ‘గ్రీన్​చానెల్​’ను అందుబాటులో ఉంచడంతో పాటు.. వాటిని తరలించేందుకు ప్రత్యేకంగా ట్రక్​ డాక్​ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్స్​రే మెషీన్​, యూనిట్​ లోడ్​ డివైస్​ల కోసం ప్రత్యేకంగా వర్క్​స్టేషన్​ను పెడుతున్నామని చెప్పారు. వ్యాక్సిన్​ ఆపరేషన్ల కోసం 24 గంటలూ పనిచేసేలా అకౌంట్​ మేనేజర్లను నియమిస్తున్నట్టు
వివరించారు.

స్పెషల్​ టాస్క్​ఫోర్స్​

కరోనా టీకా ఎక్సిమ్​(ఎక్స్​పోర్ట్​ అండ్​ ఇంపోర్ట్​) కోసం  సరఫరా కోసం స్పెషల్​ ‘కొవిడ్​19 టాస్క్​ఫోర్స్​’ను ఏర్పాటు చేసినట్టు ఛత్రపతి శివాజీ మహారాజ్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ అధికారి చెప్పారు. టీకా సరఫరాకు సంబంధించి ప్లానింగ్​, కోఆర్డినేషన్​ కోసం సప్లై చెయిన్​లోని భాగస్వాములందరితోనూ టాస్క్​ఫోర్స్​ ఎప్పటికప్పుడు టచ్​లో ఉంటుందన్నారు. టీకా రవాణా టైంను తగ్గించడంతో పాటు చల్లటి వాతావరణం ఉండేలా చూసుకుంటుందన్నారు. వీటన్నింటి కోసం రెగ్యులేటర్స్​ నుంచి స్పెషల్​ పర్మిషన్స్​ తీసుకుంటామని అన్నారు. ఎక్సిమ్​ కోసం 24 గంటల కస్టమర్​ కేర్​ సెంటర్​ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

అవసరమైతే చార్టర్​ ఫ్లైట్లూ పెడతం

వ్యాక్సిన్​ సరఫరాకు వీలైనన్ని ఎక్కువ కార్గో సర్వీసులు నడుపుతామని ఎయిర్​కార్గో కంపెనీ బ్లూ డార్ట్​ చెప్పింది. ప్రస్తుతం కంపెనీ దగ్గర 6 బోయింగ్​757 కార్గో విమానాలున్నాయని కంపెనీ ప్రతినిధి చెప్పారు. అవసరమైతే ట్రాన్స్​పోర్టేషన్​కు మరిన్ని సర్వీసులను నడుపుతామని, చార్టర్​ ఫ్లైట్లనూ ఏర్పాటు చేసే కెపాసిటీ ఉందని అన్నారు. టీకా సరఫరాకు తగ్గట్టు టైమింగ్స్​ మెయింటెయిన్​ చేస్తామన్నారు. ప్రస్తుతం దేశంలోని 8 చోట్ల 8 ఫార్మా గ్రేడ్​ కండిషనింగ్​ రూములున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్​, ముంబై, చెన్నై, అహ్మదాబాద్​, పుణె, కోల్​కతా, ఢిల్లీ, బెంగళూరుల్లో ఆ కేంద్రాలున్నాయని వివరించారు. అవి కూడా బ్లూ డార్ట్​ ఏవియేషన్​ స్టేషన్​కు అతి కొద్ది దూరంలోనే ఉన్నాయన్నారు. కాబట్టి వీలైనంత వేగంగా టీకాను డెలివరీ చేయగలమని, ట్రావెల్​ టైంను తగ్గించగలమని ఆయన తెలిపారు. అతి తక్కువ టైంలో ఎక్కువ ఫ్లైట్లు నడిపి టీకాను అందించేందుకు తాము రెడీగా ఉన్నామని మరో ఎయిర్​ కార్గో కంపెనీ అధికారి తెలిపారు. జనాభా ఎక్కువగా ఉన్న మన లాంటి దేశంలో టీకా సరఫరా అన్నది పెద్ద సవాలేనని, దానిని స్వీకరించేందుకు తాము సిద్ధమని చెప్పారు.

‘చల్లటి’ స్పెషల్​ జోన్లు

కరోనా టీకా సరఫరా కోసం ఇప్పటికే కొన్ని ఎయిర్​పోర్టులు టెంపరేచర్​ కంట్రోల్డ్​ జోన్లు ఏర్పాటు చేశాయి. ఏటా లక్షన్నర మిలియన్​ టన్నుల కార్గోను హ్యాండిల్​ చేసే రెండు టెర్మినల్స్​ ఉన్నాయని ఢిల్లీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ ఆపరేషన్లను చూసే డీఐఏఎల్​ కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆ రెండు టెర్మినళ్లలోనూ 25 డిగ్రీల నుంచి మైనస్​20 డిగ్రీల టెంపరేచర్ల వరకు కార్గోను స్టోర్​ చేసే సౌలతులున్నాయని వివరించారు. కరోనా వ్యాక్సిన్​ కోసం వాటిని మరిన్ని పెంచుతామని అన్నారు. విమానం నుంచి టెర్మినల్​ దాకా వ్యాక్సిన్​ తీసుకొచ్చేందుకూ కూల్​ చెయిన్లు మెయింటెయిన్​ చేస్తామని, ఎక్కడా ఆ చెయిన్​లో లోపాలు ఉండవని చెప్పారు. హైదరాబాద్​ శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​లోనూ వ్యాక్సిన్​ రవాణా కోసం టెంపరేచర్​ కంట్రోల్డ్​ జోన్లున్నాయని ఎయిర్​పోర్ట్​ ఆపరేషన్లు చూసే హెచ్​ఐఏఎల్​ కంపెనీ ప్రతినిధి చెప్పారు.

ఎయిరిండియా, ఇండిగో కూడా

ఎయిరిండియా కూడా వ్యాక్సిన్ ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. టీకా ట్రాన్స్ పోర్టేష న్ కోసం ఎదురు చూస్తున్నామని, విదేశాల నుంచి తీసుకొచ్చేం దుకు, దేశంలో వేరే ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు రెడీ అని ఎయిరిండియా అధికారి ఒకరు చెప్పారు. టీకా సరఫరాకు సంబంధిం చి బిజినెస్ మోడల్, ఖర్చులపై చర్చిస్తున్నట్టు ఇండిగో తెలిపింది.

For more News….

మనోళ్లపై ‘స్పుత్నిక్-V’ ట్రయల్స్.. మూడ్రోజుల్లో స్టార్ట్

ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్​ కోసం పేద దేశాలు వెయిటింగ్​

V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 

ఇకపై ఆయుర్వేద డాక్టర్లూ ఆపరేషన్లు చేయొచ్చు

రికవరీ కాలేకపోతున్నవిమాన కంపెనీలు