హీరో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా.. తన రెండో సినిమాగా ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథను అందించాడు. వారణాసి మానస హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని YTపెంచాయి. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.