ఈ ఏడాది సప్లయ్ చెయిన్‌‌‌‌‌‌‌‌పై 3 వేల మందికి శిక్షణ

ఈ ఏడాది సప్లయ్ చెయిన్‌‌‌‌‌‌‌‌పై 3 వేల మందికి శిక్షణ
  • ఎస్‌‌‌‌‌‌‌‌సీఓఏతో ఇచ్చామన్న ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సప్లయ్ చెయిన్‌‌‌‌‌‌‌‌పై ఈ ఏడాది 3 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చామని ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్ ప్రకటించింది. ఈ కంపెనీ 2021లో సప్లయ్ చెయిన్ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌  అకాడమీని (ఎస్‌‌‌‌‌‌‌‌సీఓఏ) ని ప్రారంభించింది. 

 ఈ ఏడాది శిక్షణ పొందినవారిలో 20 శాతం మంది మహిళలు ఉన్నారని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సప్లయ్ చెయిన్) హేమంత్‌‌‌‌‌‌‌‌ బద్రి అన్నారు. వచ్చే ఏడాది నాటికి 16 వేల మందికి శిక్షణ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు.