ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో చీలికలొచ్చాయి. కంపెనీ బోర్డు నుంచి కో ఫౌండర్స్ ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. 2018లో కో ఫౌండర్లలో ఒకరైన సచిన్ బన్సాల్ ఫ్లిక్ కార్ట్ బోర్డు నుంచి తప్పుకోగా.. తాజాగా మరో కో ఫౌండర్ బిన్ని బన్సాల్ రాజీనామా చేశారు. బిన్ని బన్సాల్ కొత్త కంపెనీ పెడుతున్నారు.
ఫ్లిప్ కార్ట్ నుంచి వైదొలగిన తర్వాత సచిన్ బన్సాల్ .. నావీ అనే ఫైనాన్షియల్ సంస్థను స్థాపించాడు.. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బలమైన నాయకత్వం గల బృందంతో పటిష్టంగా ఉంది. నేను కూడా ఫ్లిక్ కార్ట్ నుంచి తప్పుకుంటున్నాను అని బిన్ని బన్సాల్ ప్రకటించారు.
బిన్నీ బన్సాల్ కొత్త కంపెనీ
బిన్నీ బన్సాల్ ఫ్లిప్ కార్ట్ కు గుడ్ బై చెప్పడం వెనక కారణం.. తాను కొత్త కంపెనీ పెట్టడమే.కొత్త కంపెనీ పెడుతున్నట్లు బిన్ని ఇప్పటికే చెప్పారు. జనవరి 2024 ప్రారంభంలో బిన్ని బన్సాల్ తన కొత్త కంపెనీ OppDoor ని ప్రకటించారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ కంపెనీల అభివృద్ధి, విస్తరణకు ఎండ్ టూ ఎండ్ సోల్యూషన్స్ ను అందించనుంది. OppDoor మొదట యూఎస్, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, సింగపూర్, జపాన్ , అస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ-కామర్స్ కంపెనీలపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.