Flipkart: గుడ్ న్యూస్..ఫ్లిప్కార్ట్లో భారీగా ఉద్యోగాలు

ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆశించే నిరుద్యోగులకు ఫ్లిప్కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. స్వదేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారీగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందు కు సిద్దమవుతోంది. రాబోయే ఫెస్టివల్ సీజన్లో విక్రయాలకు ముందు ఫ్లిప్కార్ట్ భారీగా ఎంప్లాయీస్ ను నియమించుకునేందుకు పుల్ఫిల్మెంట్ సెంటర్లను ప్రారం భించింది. 

ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్  సీజన్లో  అధిక డిమాండ్ ఉంటుంది.డిమాండ్ కు తగ్గట్టుగా సప్లయ్ చేసేందుకు సిబ్బంది అవసరం ఉంటుంది. కాబట్టి ఫ్లిప్ కార్ట్ దేశవ్యాప్తంగా 9 నగరాల్లో కొత్తగా 11 పుల్ఫిల్మెంట్ సెంటర్లను ప్రారంభించింది. కొత్త కేంద్రాలతో దేశవ్యాప్తంగా ఫ్లిప్ కార్ట్ కోసం 83 పుల్ఫిల్ మెంట్ సెంటర్లు ఉన్నాయి. వీటిద్వారా దాదాపు లక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. 

ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్హౌజ్ అసోసియేట్లు, లాజిస్టిక్స్ కో-ఆర్డినేటర్లు, కిరాణా పార్టినర్స్, డెలివరీ డ్రైవర్లతో సహా వివిధ సప్లయ్ చైన్ వర్టికల్ సిబ్బందిని నియ మించుకోనున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. 

సమర్థవంతమైన, స్థిరమైన చైన్ సప్లయ్  సిస్టమ్ ద్వారా కస్టమర్ల అవసరాలను తీర్చడంతోపాటు సిబ్బంది ఆర్థికాభివృద్దికి అవకాశాలను కల్పించడం ద్వారా సంస్థ అభివృద్ది పథంలో నడిపించాలని కోరుకుంటున్నట్లు ఫ్లిప్కార్ట్  ప్రతినిధులు చెబుతున్నారు. 

ఈ-కామర్స్ కామర్స్ ఆఫ్లైన్ రిటైల్ రంగాన్ని దెబ్బతీస్తుందని, కిరాణా స్టోర్లతోసహా చిన్న రిటైలర్లను తీవ్రప్రభావానికి గురి చేస్తుందని ప్రచారం జరుగుతున్న క్రమం లో ఫ్లిప్కార్ట్ నియామకాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.