ప్రముఖ ఈ- కామర్స్ ఫ్లిప్‌కార్ట్ యాప్ లో యూపీఐ పేమెంట్స్ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. ఇప్పటికే అమెజాన్ చాలాకాలంగా అమెజాన్ పే పేరిట యూపీఐ చెల్లింపు సేవలు అందిస్తుండగా... ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ కూడా యూపీఐ చెల్లింపుల రంగంలోకి అడుగుపెట్టింది. ఇకపై ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్ లో యూపీఐ ద్వారా కొనుగోళ్లకు ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర ప్లాట్ ఫాంలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ తో కలిసి సొంతంగా యూపీఏ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పేమెంట్స్ చేసినప్పుడు ఇతర యూపీఐ యాప్ లో మాదిరిగా ఓచర్స్, రివార్డ్స్, సూపర్ కాయిన్స్ పొందవచ్చు. అంతే కాదు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఫోన్ నెంబర్ తో కూడా చెల్లింపులు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ఐడీ ఎలా క్రియేట్ చేసుకోవాలి
దీనికోసం ఫ్లిప్‌కార్ట్ యాప్ లో యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లిప్కార్ట్ యాప్ లోకి వెళ్లి ఫ్లిప్ కార్ట్ యూపీఐపై క్లిక్ చేయాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ లేదా రూపే క్రెడిట్ కార్డ్ ను యాడ్ చేసుకోని బ్యాంక్ డిటేల్స్ ఫిల్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తికాగానే మీకు 10 సూపర్ కాయిన్స్ యాడ్ అవుతాయి.
ప్రస్తుతానికి యూపీఐ సేవలను ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చామని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. త్వరలోనే యాపిల్ యూజర్స్ కు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది.