PhonePe, GPay లకు దడపుట్టిస్తున్న Flipkart సూపర్ మనీ యాప్.. ఒక్క రోజులోనే అన్ని కోట్ల పేమెంట్సా...?

PhonePe, GPay లకు దడపుట్టిస్తున్న Flipkart సూపర్ మనీ యాప్..  ఒక్క రోజులోనే అన్ని కోట్ల పేమెంట్సా...?

ఇండియాలో అప్రకటిత UPI పేమెంట్స్ వార్ నడుస్తోంది. నేనంటే నేను ముందు.. అన్నట్లుగా యూపీఐ యాప్స్ పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు డామినేట్ చేస్తూ వస్తు్న్న PhonePe, GoolePay యాప్స్ కు దడ పుట్టిస్తూ ఫ్లిప్ కార్ట్ super.money యాప్ దూసుకొస్తోంది. స్టార్ట్ చేసిన కొన్ని నెలలకే టాప్ 5 లోకి దీసుకొచ్చి అప్పటి దాకా ఉన్న కొన్ని యాప్స్ కు షాక్ ఇస్తోంది. 

కునాల్ షా ప్రారంభించి సెన్సేషనల్ అయిన క్రెడ్ (Cred) యాప్ ను వెనక్కు నెట్టేసింది  Flipkart సూపర్ మనీ యాప్. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రిపోర్ట్ ప్రకారం ఫిబ్రవరి నెలలో క్రెడ్ ను వెనక్కు నెట్టి 5వ స్థానాన్ని ఆక్రమించింది. అయితే యూపీఐ డెయిలీ ట్రాన్జాక్షన్స్ ఈ ఫిబ్రవరి నెలలో అత్యధికంగా ఉన్నాయని, మొదటి సారిగా రూ.లక్ష కోట్లు దాంటిందని ప్రకటించింది. మార్చి 1వ తేదీన రూ.లక్షా 16 వందల కోట్ల విలువైన ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు నివేదిక వెల్లడించింది. 

యూపీఐ యాప్స్ మధ్య పోటీ:

సచిన్ బన్సల్ ప్రారంభించిన ఫిన్ టెక్, క్రెడిట్ ప్లాట్ ఫామ్ Navi (నవీ) నవంబర్ నెలలో 4వ అతిపెద్ద యూపీఐ యాప్ గా నిలిచింది. అదే విధంగా ఫిబ్రవరిలో ఫ్లిప్ కార్ట్ super.money యాప్ క్రెడ్ ను దాటేసి ఫిఫ్త్ ప్లేస్ కు వచ్చింది. అంటే ఇప్పటి వరకు మార్కెట్ లో టాప్ 5 లో ఉన్న కంపెనీలను వెనక్కు నెట్టేస్తు ఈ యాప్స్ సూపర్ ఫాస్ట్ గా టాప్ 5లోకి వచ్చేశాయి. ఒకవైపు యూపీఐ మార్కెట్ గ్రాబ్ చేసిన PhonePe ఫిబ్రవరిలో తగ్గుతుంటే Navi, super.money  ఈ యాప్స్ గ్రోత్ మోడ్ లో దూసుకెళ్లడం మార్కెట్ ను సర్ ప్రైజ్ చేసిందనే చెప్పాలి. 

Also Read:-జన్మభూమి ఎక్స్ప్రెస్ రూట్ మార్చారు.. ఏప్రిల్ 25 నుంచి సికింద్రాబాద్ స్టాప్ రద్దు..

ఫిబ్రవరి నెలలో Navi 20 కోట్ల 61అక్షల ట్రాన్జాక్షన్స్ నమోదైతే , super.money 13 కోట్ల9 లక్షల ట్రాన్జాక్షన్ రిజిస్టర్ అయినట్లు రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇక క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ యాప్ క్రెడ్ (Cred) 13 కోట్ల వద్దే కొట్టుమిట్టాడుతూ 6వ స్థానానికి పడిపోయింది. 

ఇక స్టాక్ మార్కెట్ ఐపీఓ (IPO) ట్రాన్జాక్షన్లలో కూడా పోన్ పే (PhonePe) మానినేట్ చేస్తోందని రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. 

ఫోన్ పే ప్రస్తుతం 47.5 శాతం మార్కెట్ షేర్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. గూగుల్ కు సంబంధించి గూగుల్ పే యాప్ 35 శాతం మార్కెట్ షేర్ తో రెండో స్థానంలో ఉంది. మూడవ స్థానంలో Paytm 6.7 మార్కెట్ షేర్ తో ఉంది. తరువాతి స్థానాలను Navi , super.money యాప్స్ ఆక్యుపై చేయడం గమనార్హం. 

యూపీఐ పేమెంట్స్ లో ఫోన్ పే, గూగుల్ పే డామినేషన్ తగ్గించి కొత్త వారికి కూడా చాన్స్ ఇవ్వాలని NPCI గతంలో ప్రకటించింది. ఎందుకంటే ఈ రెండు యాప్స్ కలిసి 84 శాతం UPI ట్రాన్జాక్షన్స్ మార్కెట్ షేర్ ఆక్రమించకున్నాయి.  2024 చివరి వరకు ఏ కంపెనీ అయినా 30 శాతం మార్కెట్ షేర్ మించి ఉండరాదనే నిబంధన తెచ్చింది. కానీ ప్రస్తుతం పాత నిబంధననే కొనసాగించింది. 

ఒక్క రోజులోనే లక్ష కోట్ల ట్రాన్జాక్షన్స్:

యూపీఐ ట్రాన్జాక్షన్స్ వచ్చిన తర్వాత పేమెంట్స్ ఎక్కువ శాతం ఆన్ లైన్ లోనే అయిపోతున్నాయి. గత ఏడాది నుంచి చూసుకుంటే ఒక్క రోజులోనే 90 వేల కోట్ల రూపాయల ట్రాన్జాక్షన్స్ యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. ఈ ఫిబ్రవరిలో  99 వేల835 కోట్ల రూపాయల ట్రాన్జాక్షన్స్ కు చేరుకుంది. అంటే ఒక్క రోజులోనే దాదాపు లక్ష కోట్ల రూపాయల ట్రాన్జాక్షన్స్ జరుగుతుండటం విశేషం.