ఇవాళ్టి (ఫిబ్రవరి 20) నుంచి ఫ్లిప్​కార్ట్​ టీపీఎల్ ​సేల్​

ఇవాళ్టి (ఫిబ్రవరి 20) నుంచి ఫ్లిప్​కార్ట్​ టీపీఎల్ ​సేల్​

హైదరాబాద్​, వెలుగు : ఈ–-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌ ఫ్లిప్‌కార్ట్ ఈ సంవత్సరం ఫ్లిప్‌కార్ట్ ట్యాబ్లెట్ ప్రీమియర్ లీగ్ 2025 (టీపీఎల్ 2025)  మొదటి ఎడిషన్‌ను గురువారం  నుంచి ప్రారంభించనుంది.  ఈసారి ప్రీమియం ట్యాబ్లెట్‌లపై భారీ డీల్స్​ను, ఆఫర్లను అందిస్తామని, వినియోగదారులు తమ బడ్జెట్‌ను పెంచకుండా  అప్‌గ్రేడ్ కావొచ్చని తెలిపింది.

శామ్‌సంగ్ , లెనోవో , యాపిల్ , రియల్ మీ , వన్ ప్లస్ , రెడ్ మీ , ఎంఐ , పోకో ,  ఇన్ఫినిక్స్ వంటి బ్రాండ్ల ట్యాబ్లెట్లపై ఆఫర్లు ఉంటాయి. కొన్ని ప్రొడక్టులపై 50 శాతం వరకు డిస్కౌంట్​ఉంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 9ను రూ.40 వేలకు అమ్ముతారు. లెనోవో టాబ్ ప్లస్​ను రూ. 13,749లకు సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ఐ పాడ్ 10వ జెనరేషన్​ధరలు రూ. 28,999 నుంచి మొదలవుతాయి. వన్ ప్లస్ పాడ్ గో రూ. 10,799లకు అందుబాటులో ఉంటుంది. కొన్ని కార్డులతో కొంటే అదనపు డిస్కౌంట్లు ఉంటాయి.