ఫ్లిప్‌‌కార్ట్  యూజర్లు ఆల్‌‌టైమ్ హై

ఫ్లిప్‌‌కార్ట్  యూజర్లు ఆల్‌‌టైమ్ హై

వాల్‌‌మార్ట్‌‌కు పెరిగిన సేల్స్

ఇంటర్నేషనల్ సేల్స్

రూ.2.19 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ఫ్లిప్‌‌కార్ట్, ఫోన్‌‌పే నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య ‘ఆల్ టైమ్ హై’కు చేరుకుందని ఈ–కామర్స్ కంపెనీ వాల్‌‌మార్ట్ ప్రకటించింది. ఈ యూజర్ల సపోర్ట్‌‌తో అక్టోబర్‌‌‌‌తో ముగిసిన మూడో క్వార్టర్‌‌‌‌లో ఇంటర్నేషనల్ వ్యాపారాల అమ్మకాలు 1.3 శాతం పెరిగి 29.6 బిలియన్ డాలర్లకు(రూ.2,19,580 కోట్లకు) చేరుకున్నాయని వాల్‌‌మార్ట్ తెలిపింది. 2018లోనే ఫ్లిప్‌‌కార్ట్‌‌ను 16 బిలియన్ డాలర్లకు(రూ.1,18,692 కోట్లు) అమెరికాకు చెందిన వాల్‌‌మార్ట్ కొనుగోలు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో వాల్‌‌మార్ట్ నేతృత్వంలో నిర్వహించిన ఫైనాన్సింగ్ రౌండ్‌‌లో 1.2 బిలియన్ డాలర్లను సేకరించి, ఫ్లిప్‌‌కార్ట్ వాల్యు 24.9 బిలియన్ డాలర్లుగా లెక్కకట్టింది. ‘ఇంటర్నేషనల్ సెగ్మెంట్లలో నికర అమ్మకాలు రూ.2,19,580 కోట్లుగా ఉన్నాయి. ఈ అమ్మకాలు 1.3 శాతం పెరిగాయి. కరెన్సీ రేట్లలో వచ్చిన మార్పులు మా నికర అమ్మకాలపై నెగిటివ్‌‌ ప్రభావం చూపాయి. ఒకవేళ కరెన్సీని మినహాయిస్తే.. మా నికర అమ్మకాలు రూ.2,26,998 కోట్లుగా ఉండేవి. ఫ్లిప్‌‌కార్ట్, ఫోన్‌‌పేకు రికార్డు సంఖ్యలో మంత్లీ యాక్టివ్ కస్టమర్లు నమోదు కావడంతో నెట్ సేల్స్‌‌లో మంచి గ్రోత్‌‌ను రిపోర్ట్ చేశాం’ అని వాల్‌‌మార్ట్ ప్రకటించింది.

‘బిగ్ బిలియన్ డే’ సేల్స్‌‌తో ఫ్లిప్‌‌కార్ట్, తన పేమెంట్ యాప్ ఫోన్‌‌పేలకు మంచి గ్రోత్ నమోదైంది. కరోనా మహమ్మారి ఉన్న సమయంలో షాపర్లు ఎక్కువగా డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌‌లోకి మరలడంతో ఈకామర్స్ కంపెనీలు సాధారణంగానే మంచి గ్రోత్‌‌ను రికార్డు చేశాయి. అక్టోబర్ నెలలో ఫ్లిప్‌‌కార్ట్ చాలా బాగా పర్‌‌‌‌ఫార్మ్ చేసింది. ఇటీవలే తన అతిపెద్ద బిగ్ బిలియన్ డే సేల్స్ ఈవెంట్‌‌ను కూడా పూర్తి చేసిందని వాల్‌‌మార్ట్ తెలిపింది.

Read more news

షుగర్ ఉంటే తేనె వాడొచ్చా..?

కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ

ఫ్లిప్ కార్ట్ యూజర్లు ఆల్ టైమ్ హై

కరోనా టెస్ట్.. జస్ట్ రూ.850

పేకాటలో టెక్నాలజీ.. తండ్రీ కొడుకుల ఛీటింగ్