హైదరాబాద్, వెలుగు : ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ డిజిటల్ బీ2బీ మార్కెట్‌ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, దాని బీ2బీ సభ్యుల కోసం ఈ నెల 9 నుంచి నవంబర్ 1వ తేదీ మధ్య దీపావళి షాపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. కిరాణా, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఇంటి సామానులు, గృహోపకరణాలు, బుక్స్
ఇతర అనేక వస్తువులపై భారీ తగ్గింపులు, ఆఫర్లు లభిస్తాయని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ దినకర్ అయిలవరపు చెప్పారు. కొనుగోలుదారుల కోసం బంపర్ ప్రైజ్‌లు కూడా ఉంటాయని, ఆన్‌లైన్ ఛానెల్‌లో హీరో ఆఫర్లు ద్వారా వివిధ ప్రయోజనాలను పొందవచ్చన్నారు.