కోవిడ్ -19 ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో మనందరికి తెలుసు..ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని పొట్టన బెట్టుకుంది.. ఈ మహమ్మారి గ్లోబల్ ఎకనామినీ అస్తవ్యస్తం చేసింది. కోవిడ్ దెబ్బకు ఇప్పటి కొన్ని దేశాలు ఇంకా కోలుకోలేదు..అయితే కోవిడ్ వైరస్ పూర్తిగా నిర్మూలించబడలేదు అంటున్నారు శాస్త్రవేత్తలు..కొత్త వేరియంట్లుగా పుడుతూ ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. తాజాగా అమెరికాలో FLiRT అనే వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుందని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళను చెందుతున్నారు. ఈ మహమ్మారి కొత్త వేవ్ గత వేరియంట్ల కంటే ప్రమాదకర మైనది అనిఅంటున్నారు. ఈ కొత్త వేవ్ పై అనేక సందేహాలు, FLiRT అంటే ఏందీ, దాని లక్షణాలు, దీనివలన ప్రమాద తీవ్రత ఎంత వంటి విషయాలు తెలుసుకుందాం..
FLiRT అంటే..
FLiRT అనేది ఫ్లూ లాంటి శ్వాస నాళానికి సంబంధించిన వేరియంట్ అమెరికాలో వ్యాప్తి చెందుతుంది. ఇది COVID -19 వైరస్ కొత్త వేరియంట్ గా గుర్తించారు. ఇది గత డిసెంబర్ లో వచ్చిన JN1 వేరియంట్ వారసులు. వీటి లక్షణాలు గత వేరియంట్ల కంటే కొంచెం భిన్నంగా ఉన్నాయి.
FLiRT లక్షణాలు..
FLiRT కొత్త వైరస్ లక్షణాలు..ఫ్లూ,కోవిడ్-19 లక్షణాల కలయికతో ఉన్నాయి. దీని వలన గుర్తించడం కష్టంగా మారింది. FLiRT సోకిన రోగులు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులు, అలసట రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు.
FLiRT ప్రమాదకరమా?
‘‘SARS-CoV-2 Omicron సబ్‌వేరియంట్‌ల అభివృద్ధి చెందుతున్న వేరియంట్ల సమూహాన్ని FLiRT అని పిలుస్తారు. ఇవి యునైటెడ్ స్టేట్స్ అంతటా వేగంగా వ్యాపిస్తున్నాయి. వీటిలో KP2 జాతి దాదాపు 25శాతం వ్యాప్తిని కలిగి ఉంది. ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి త్వరగా వ్యాప్తి చెందే లక్షణాలను కలిగి ఉన్నాయి’’ అని డాక్టర్లు చెబుతున్నారు.
భారత దేశంలో ఇంకా FLiRT వ్యాప్తి చెందలేదు. FLiRT త్వరగా వ్యాప్తం చెందే గుణం ఉండటం వల్ల అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం అయిన భారత్ లో వ్యాపిస్తే పరిస్థితి ఏంటని ఆందోళనలు కలిగిస్తోంది. వ్యాక్సినేషన్, మాస్కింగ్, శ్వాస కోశ పరిశుభ్రత వంటి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.
అమెరికాలో FLiRT వ్యాప్తి ఆందోళన కలిగించే విషయమే అయినా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ మహమ్మారి విషయంలో సరియైన సమాచారం, దాని వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండటం, నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు