![ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం: కొట్టుకుపోయిన ఎనిమిది కార్లు, బస్సు](https://static.v6velugu.com/uploads/2024/06/eight-cars-bus-washed-away_BsqPJgcr2m.jpg)
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. భారీ వరదల కారణంగా హరిద్వార్‌లో ఓ శ్మశాన వాటిక వద్ద పార్క్ చేసిన ఎనిమిది కార్లు, బస్సు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద ఉధృతికి నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి.
రంగంలోకి దిగిన సహాయక బృందాలు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. స్థానికులెవరూ నదుల దగ్గరకు వెళ్లొద్దని హెచ్చరించారు. వరదల్లో కార్లు, బస్సు కొట్టుకుపోతున్న దృష్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఇటీవల రుతుపవనాలు విస్తరించాయి. దీంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నదుల్లో నీటి మట్టాలు పెరిగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.