నిజామాబాద్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతోంది. ఎగువనుంచి 8వేల 796 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1063.70 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటినిల్వ 14.450 టీఎంసీలకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్టు నీటి మట్టం 1070.90 అడుగులు, నీటి నిల్వ 24.795 టీఎంసీలుగా ఉంది.