Nagarjuna Sagar project : సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. ఎడమకాల్వకు నీటి విడుదల

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో సాగర్ వరద పోటెత్తింది. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ జలాశయాన్ని చేరుతోంది.

 సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 3 లక్షల 34వేల 462 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 548.80 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 207.1416 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టునుంచి 30వేల 712 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. 

మరోవైపు ఇవాళ శుక్రవారం ఆగస్టు 2,2024 సాయంత్రం సాగర ఎడమ కాల్వకు తెలంగాణ మంత్రులు నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు..  తాగు, సాగు అవసరాలకు నీటిని విడుదల నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, బత్తుల లక్ష్మా రెడ్డి ఉన్నారు. 500 క్యూసెక్కుల చొప్పున పెంచుకుంటూ 11 రోజుల పాటు నీటి విడుదల చేయనున్నారు.