
మంచిర్యాల, వెలుగు: రామగుండం పోలీస్‌కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో బుధవారం నిర్వహించిన ఫ్లడ్రెస్క్యూ టీమ్ డెమో ఆకట్టుకుంది. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్, స్పెషల్ పార్టీ నుంచి 20 మంది కానిస్టేబుళ్లతో ఈ టీమ్‌ను ఏర్పాటు చేశారు.
వీరికి హైదరాబాద్ లోని ఎన్డీఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇప్పించారు. ముందస్తు అప్రమత్తతలో భాగంగా ప్రమాదంలో ఉన్న వారిని ఎలా రక్షించాలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఫ్లడ్ రెస్క్యూ టీమ్ డెమో నిర్వహించారు. కలెక్టర్ బి.సంతోష్, డీసీపీ అశోక్‌కుమార్, గోదావరిఖని, మంచిర్యాల ఏసీపీలు రమేశ్, ప్రకాశ్, రూరల్ సీఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు.