ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో ముంపు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వరదతో చత్తీస్ ఘడ్ - తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
టేకులగూడెం దగ్గర జాతీయ రహదారి NH -163 పై గోదావరి వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో రహదారిని మూసివేశారు. చత్తీస్ ఘడ్ వెళ్లే వాహనదారులు వయా పరకాల- భూపాలపల్లి - మహదేవ్ పూర్ మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.