ఖమ్మం జిల్లాలో దంచికొట్టిన వాన

ఖమ్మం జిల్లాలో దంచికొట్టిన వాన

ఖమ్మం జిల్లాలో మంగళవారం వాన దంచికొట్టింది.  తల్లాడ మండలంలో బిల్లుపాడు వద్ద బ్రిడ్జి పై నుంచి వరదనీరు ప్రవహించడంతో నాలుగు గ్రామాలకు  రాకపోకలు నిలిచిపోయాయి. వరద పరిస్థితిని తల్లాడ ఎస్సై కొండలరావు పరిశీలించి వాగు దాటకుండా బందోబస్తు నిర్వహించారు. తల్లాడ వెంకటరామా థియేటర్​ పరిసరాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. రోడ్లు మునిగిపోయాయి. మండలంలోని పినపాక వద్ద ఏరు ఉధృతంగా ప్రవహించి పంట పొలాలు నీటమునిగాయి.

భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఏడు మెలికల వాగు పొంగి ప్రవహిస్తోంది. ఐదు గ్రామాలకు  రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని, ఏడుమెలికల వాగు పొంగడంతో జనజీవనం  స్తంభించింది. గిరిజనులు వాగు దాటకుండా మండల ఆఫీసర్లు బారికేడ్లు ఏర్పాటు చేశారు.  లోలెవల్​ వంతెన పై నుంచి వాగు ఉధృతంగా ప్రవహించింది. 

– ఖమ్మం/తల్లాడ/గుండాల, వెలుగు