- సౌత్ కొరియాలో ఘోరం
సియోల్: సౌత్కొరియాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అకస్మాత్తుగా వరద ముంచెత్తడంతో రోడ్ టన్నెల్ ఒకటి నీట మునిగింది. టన్నెల్ లోపల పలు వాహనాలు చిక్కుకుపోయాయి. అందులో పలువురు మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. ఆదివారం టన్నెల్లో నుంచి ఏడు మృతదేహాలను రెస్క్యూ టీమ్వెలికితీసింది. బురదనీటిలో సుమారు 15 వెహికల్స్ చిక్కుకుపోయాయని రెస్క్యూ సిబ్బంది తెలిపారు.
భారీవర్షాలకు వరదలు పోటెత్తాయని, కొండచరియలు విరిగిపడటంతో 33 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం చెయోంగ్జు సిటీలోని టన్నెల్లోకి ఓ బస్సుతోపాటు కొన్ని వెహికల్స్ వరద ధాటికి కొట్టుకుపోయాయి. దీంతో సుమారు400 మంది రెస్క్యూ సిబ్బంది టన్నెల్ లో సహాయక కార్యక్రమాలు చేపట్టారని సిటీ ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ సియో జియోన్జిల్వెల్లడించారు.
కేవలం రెండు, మూడు నిమిషాల వ్యవధిలోనే వరద నీటితో టన్నెల్ నిండిపోయిందని అధికారులు చెప్పారు.