ఆసియా కప్ లో భాగంగా నిన్న సూపర్-4 మ్యాచ్ లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి మ్యాచులో 7 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. లాహోర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఒకవింత సంఘటన చోటు చేసుకుంది. డేనైట్ మ్యాచులో బంగ్లా విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ కి ఊహించని అనుభవం ఎదురైంది. 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసిన సమయంలో ఫ్లడ్ లైట్స్ ఫెయిల్యూర్‌తో మ్యాచ్‌కి కాసేపు అంతరాయం కలిగింది. దీంతో దాదాపు 15 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది.
సాంకేతిక లోపం కారణంగా ఫ్లడ్ లైట్ ఆఫ్ కావడంతో గ్రౌండ్‌లో చాలా భాగం చిమ్మచీకటి కమ్ముకుంది. దీంతో అభిమానులు తమ మొబైల్ ఫోన్ లైట్స్ ఆన్ చేయడం గమనార్హం. ఈ సంఘటన అనంతరం పాక్ క్రికెట్ బోర్డుపై విమర్శలు వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే లెక్క ప్రకారం ఆసియా కప్ 2023 మ్యాచులన్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉంది. అయితే భారత్ అక్కడికి వచ్చే ప్రసక్తే లేదనడంతో టీమిండియా ఆడే మ్యాచులన్నీ శ్రీలంకకు తరలించారు. కానీ శ్రీలంకలో భారీ వర్షాలు కురవడం కారణంగా పాకిస్థాన్ లో మ్యాచులు నిర్వాల్సిందిగా పాక్ బోర్డు కోరింది. దీనికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ నో చెప్పింది.
ALSO READ: క్రికెటర్ అయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా.. గంభీర్ షాకింగ్ కామెంట్స్
ఎప్పుడైతే ఆసియా క్రికెట్ కౌన్సిల్ నో చెప్పిందో అప్పటి నుంచి పాక్ బోర్డు రెచ్చిపోయింది. మాపై ఆడదానికి భారత్ కి భయమా..? అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కానీ నిన్న పాకిస్థాన్ లోని లాహోర్ స్టేడియంలో జరిగిన బాగోతం చూస్తుంటే శ్రీలంకలో మ్యాచులు నిర్వహించడమే కరెక్ట్ అనే అభిప్రాయలు వ్యక్తమ అవుతున్నాయి. మొత్తానికి చెత్త వ్యాఖ్యలు చేస్తూ భారత్ ని రెచ్చగొట్టిన పాకిస్థాన్ బోర్డుకి తగిన శాస్తి జరిగిందని అభిమానులు భావిస్తున్నారు.