![కేరళను మళ్లీ ముంచిన వర్షాలు](https://static.v6velugu.com/uploads/2019/07/kerala-2.jpg)
కేరళను మరోసారి వర్షాలు ముంచెత్తాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చాలా గ్రామాలు నీటమునిగాయి. జనజీవనం స్తంభించింది. అటు.. జలాశయాల్లోకి భారీగా నీరు చేరుతోంది. ఇడుక్కి లోని కల్లార్ కుట్టీ డ్యాంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.