గర్భిణుల్లో ఫ్లోరైడ్​ లక్షణాలు

గర్భిణుల్లో ఫ్లోరైడ్​ లక్షణాలు
  •     నల్గొండ జిల్లా మర్రిగూడలో కలకలం
  •     ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించిన ఏఎన్‌‌‌‌ఎంలు

చండూరు (మర్రిగూడ), వెలుగు : నల్గొండ జిల్లాలో మరోసారి ఫ్లోరోసిస్‌‌‌‌ ప్రబలుతోంది. మర్రిగూడ మండలానికి చెందిన గర్భిణుల్లో ఫ్లోరోసిస్‌‌‌‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఆఫీసర్లు మండలంలోని అన్ని గ్రామాల్లో ఫ్లోరైడ్‌‌‌‌ సర్వేను కొనసాగిస్తున్నారు. మండలంలో మొత్తం 39,700 జనాభా ఉంది. ఏఎన్‌‌‌‌ఎంలు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, శాంపిళ్లు సేకరిస్తున్నారు. మర్రిగూడ మండలంలో వ్యవసాయ పనులు చేసే ప్రజలు అక్కడే బోరు నీళ్లు తాగడం, స్థానికంగా పండే ఆహారం తీసుకోవడం వల్ల ఫ్లోరోసిస్‌‌‌‌ వ్యాప్తి చెందుతుందా ? అనే కోణంలో విచారణ ప్రారంభించారు.