అమెరికాలో కాల్పులు..ఫ్లోరిడా యూనివర్సిటీ రక్తసిక్తం..ఇద్దరు మృతి, ఆరుగురికి బుల్లెట్ గాయాలు

అమెరికాలో కాల్పులు..ఫ్లోరిడా యూనివర్సిటీ రక్తసిక్తం..ఇద్దరు మృతి, ఆరుగురికి బుల్లెట్ గాయాలు

అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ కాల్పులతో దద్దరిల్లింది. శుక్రవారం (ఏప్రిల్18) ఫ్లోరిడాయూనిర్సిటీలో 20 యేళ్ళ యువకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు.ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఊహించిన ఘటనతో విద్యార్థులు,అధ్యాపకులలో భయాందోళనకు గురయ్యారు.

శుక్రవారం ఉదయం11:50 గంటలకు యూనివర్సిటీ క్యాంపస్ లోని విద్యార్థి సంఘం భవనం సమీపంలో కాల్పులు జరిపాడు. అకస్మాత్తుగా కాల్పులు జరగడంతో క్యాంపస్‌ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు.నిందితుడిని అదపులోకి తీసుకున్నారు. అయితే మరణించిన ఇద్దరు వ్యక్తులు యూనివర్సిటీ విద్యార్థులు కాదని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పోలీస్ చీఫ్ జాసన్ ట్రంబోవర్ తెలిపారు.

నిందితుడు 20 ఏళ్ల FSU విద్యార్థి ఫీనిక్స్ ఇక్నర్ గా గుర్తించారు.అతను లియోన్ కౌంటీ విభాగంలోని పోలీస్ అధికారి కుమారుడు. రిసోర్స్ ఆఫీసర్ అయిన  జెస్సికా ఇక్నర్ సర్వీస్ తుపాకీని ఆమె కుమారుడు ఫీనిక్స్ కాల్పుల్లో ఉపయోగించారని లియోన్ కౌంటీ షెరీఫ్ వాల్టర్ మెక్‌నీల్ తెలిపారు. ఇక్నర్ షెరీఫ్ కార్యాలయం యువజన సలహా మండలిలో పర్మినెంట్ మెంబర్.. కార్యాలయంలో అనేక శిక్షణా కార్యక్రమాలలో పాల్గొన్నాడని మెక్‌నీల్ చెప్పారు.