
ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మునుగోడు నియోజకవర్గం మరో ఉద్దానంలా మారింది. నియోజకవర్గంలోని మర్రిగూడ, నాంపల్లి, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో ఫ్లో రైడ్ ప్రభావంతో చాలా మంది కిడ్నీలు ఫేయిలై నరకమనుభవిస్తున్నా రు. డయాలసిస్ మీదబతుకులు వెళ్లదీస్తున్నారు. ఇక్కడ భూగర్భ జలాల్లోఫ్లో రిన్ 17 పీపీఎం వరకు ఉంది. సాధారణంగా 0.5–-1.5 పీపీఎం మాత్రమే ఉండాలి. ప్రభుత్వాలు మారుతున్నా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంలేదు.ఈ ప్రాంతానికి ఏడెనిమిదేళ్ల నుంచి కృష్ణాజలాలను సరఫరా చేస్తున్నా రు. అయినా ఇంకా చాలా గ్రామాల్లో ట్యాంకులు లేవు. నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక, నీళ్లు వచ్చే సమయానికి ఇంటి దగ్గర లేక కృష్ణా జలాలను చాలామంది వాడడం లేదు. ఫ్లో రైడ్‍నీ ళ్లతో మొదట నరాలు బలహీనమవుతాయి. ఎముకల్లోని గుజ్జు గడ్డకట్టుకు పోయి కాళ్లు, చేతులు వంకరపోయి, నడుం వంగిపోతుంది. తర్వాత కిడ్నీల్లో చేరినఫ్లో రైడ్ రాళ్లుగా మారి, కిడ్నీలు పనిచేయకుండా పోతున్నా యి. ప్రస్తుతం మర్రిగూడ, నాంపల్లి, నారాయణపురం మండలాల్లో 10 వేల మందికి పైగా కిడ్నీలో రాళ్లతోబాధపడుతున్నారు. పుట్టపాక, నామాపురం, కొట్టాల,దామెరభీమనపల్లి గ్రామాల్లో వందల మంది కిడ్నీలుచెడిపోయి నిత్యం డయాలసిస్‍పై బతుకీడుస్తున్నారు.
రెండు కిడ్నీలు చెడిపోతున్నాయిలా..
ఫ్లో రైడ్ పీడిత గ్రామాల్లోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువున్నా రు. కిడ్నీల్లో ఫ్లోరిన్ చేరి కడుపు నొప్పి వస్తుంది.దాంతో ఆర్‍ఎంపీలు ఇచ్చే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు,ట్యాబెట్లు వాడి వదిలేస్తున్నారు. దీంతో కొంత కాలానికికిడ్నీలు చెడిపోతున్నా యి. అప్పుడు పెద్దా సుపత్రులకువెళ్లి అడ్మిట్ అవుతున్నా రు. కొంతమందికి నీళ్ల వల్ల,మరికొంత మందికి ఒత్తిడి వల్ల బీపీ, షుగర్ పెరిగికిడ్నీలు చెడిపోయాయని మెడికల్ రిపోర్టుల్లో తేలింది.
డయాలసిస్ లక్షల్లో
ఖర్చుకిడ్నీలకు వైద్యం అంటే చాలా కాస్ట్లీ. స్థా నికంగా డాక్టర్లుండరు. హైదరాబాద్, నల్లగొండ, నార్కట్‍పల్లిలోఉండే స్పెషలిస్టు డాక్లర్ల దగ్గరకు వెళ్లాలి. రెండు కిడ్నీలు చెడిపోతే డయాలసిస్ చేయించుకోవాలి. రెండు,మూడు రోజులకోసారి ఇది తప్పనిసరి. ఒకసారిడయాలసిస్ చేయించుకుంటే ప్రైవేటు ఆసుపత్రుల్లోరూ.3వేలు. సర్కారు దవాఖానల్లో రూ.1500 ఖర్చవుతుంది. ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తున్నా మందులు,ఇంజెక్షన్లు, రవాణా ఛార్జీలకు బాగానే ఖర్చవుతుంది.ఆరోగ్యశ్రీ కార్డు లేక పోతే నెలకు రూ.35 వేల నుంచిరూ.70 వేలు ఖర్చవుతోంది. దీంతో ఆర్థిక స్థోమతలేనివారు వైద్యం చేయించుకోలేక చనిపోతున్నా రు.
ఒక్క గ్రామంలోనే 400 మంది..
సంస్థాన్ నారాయణపరం మండలం పుట్టపాకలోనే 400 మంది కిడ్నీ బాధితులున్నా రు. 1200కుటుంబాలు.. ఆరు వేల జనాభా ఉన్న ఈ ఊళ్లో గతమూడేళ్లలో కిడ్నీలు చెడిపోయి 12 మంది చనిపోయారు. ఇంటికి ఇద్దరికి పైగా కిడ్నీలో రాళ్లతో, ఇతర కిడ్నీసంబంధ సమస్యలతో అవస్థలు పడుతున్నా రు. ఈఒక్క గ్రామంలోనే గత ఏడాది ఆరోగ్యశ్రీ కింద 26మంది కిడ్నీ వ్యాధులకు ఆపరేషన్ లు చేయించుకున్నా రు. మరెంతో మంది హైదరాబాద్, నార్కట్‍పల్లి,నల్గొండలకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు.పుట్టపాకలో చేనేత కార్మికుల్లోనే ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. గంటల తరబడిమగ్గంపై కూర్చుంటుండడంతో కిడ్నీలు చెడిపోతున్నా యని అంటున్నారు.