ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి లాక్కున్నారు..!

ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి  లాక్కున్నారు..!
  • తెలంగాణకు కేటాయించిన ఫ్లోరైడ్‌‌ రీసెర్చ్‌‌ సెంటర్‌‌ను బెంగాల్‌‌కు తరలించిన కేంద్రం
  • 2009లో ఉమ్మడి నల్గొండకు మంజూరు
  • 2014లో చౌటుప్పల్‌‌లో 8 ఎకరాలు కేటాయింపు
  • అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విబేధాలు
  • ఇంటర్నేషనల్‌‌ ఫ్లోరోసిస్ ఇన్‌‌ ఆర్సెనిక్‌‌ పేరుతో బెంగాల్‌‌లో ఏర్పాటు

నల్గొండ, వెలుగు : కేంద్ర ప్రభుత్వం గతంలో తెలంగాణకు మంజూరు చేసిన ఫ్లోరైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతీయ పరిశోధన కేంద్రం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరో రాష్ట్రానికి తరలిపోయింది. సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించి, ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు తలెత్తడంతో ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్తా పశ్చిమబెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిపోయింది.

2009లో కేటాయించిన యూపీఏ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యకు పరిష్కారం చూపడం, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లోరోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జాతీయ పోషకాహార సంస్థ ప్రతిపాదించింది. దీంతో 2009లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను కేటాయించింది. అంతేకాకుండా ఉమ్మడి ఏపీ, కర్ణాటక, ఒడిశా, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పుదుచ్చేరి, గోవా, అసోం, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాల ప్రజలకు సైతం ప్రయోజనం కలిగేలా ఫ్లోరైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  

2014లో 8 ఎకరాలు కేటాయింపు 

ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణంలో భాగంగా తొలి విడతలో 20 బెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 2014లో అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాలో 8 ఎకరాలను కేటాయించింది. అయితే అప్పట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విబేధాలు ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లను మంజూరు చేయలేదు. అంతేకాకుండా.. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రం పరిధిలోకే రాదని, అందుకే నిధులు కేటాయించడం లేదని 2019లో కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకనే ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పట్టించుకోలేదన్న వాదన వినిపించింది. మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులతో ఫ్లోరైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యను పరిష్కరిస్తామన్న ఆలోచనతో అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి.

ALSO READ : తెలంగాణలో ఓటర్లు 3 కోట్ల 35 లక్షలు..మహిళలే అధికం

బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించిన కేంద్రం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ గొడవలు తలెత్తడంతో తెలంగాణకు మంజూరైన ప్రాంతీయ పరిశోధన కేంద్రం కాస్తా బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిపోయింది. కేంద్రం ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరును ‘ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లోరోసిస్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్సెనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా మార్చి 2020లో బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసింది. ఇంత జరిగినా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదు. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ఫ్లోరోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాడలు బయటపడుతుండగా ఈ సెంటర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 

సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

 తెలంగాణకు కేటాయించిన రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లోరోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేంద్రం పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించడం దారుణం. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ అసమర్థతోనే ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.

– కంచుగట్ల సుభాష్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్-